NTV Telugu Site icon

Pushpa 2 : హమ్మయ్య రిలీజ్ ఈ ఏడాదే ఉంది మాష్టారు… క్లారిటీ ఇచ్చేశారు!

Allu Arjun Sukumar

Allu Arjun Sukumar

Allu Arjun Dismiss delay speculations of Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 అనే సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద చాలా ఆశలు పెట్టుకుంది సినిమా యూనిట్. అందుకనే ముందు అనుకున్న స్క్రిప్ట్ కంటే అనేక మార్పులు చేర్పులు చేసి పాన్ ఇండియా లెవెల్ కి మించి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాని డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే డిసెంబర్ 6వ తేదీ కూడా సినిమా రిలీజ్ కావడం కష్టమేనని ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో అదేమీ నిజం కాదని డిసెంబర్లోనే దిగుతున్నామని అల్లు అర్జున్ తాజాగా ప్రకటించాడు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా pre రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ అతిథిగా హాజరయ్యాడు.

Vishwambhara : అర్ధరాత్రి ‘విశ్వంభర’ ట్రీట్

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ తాను చేస్తున్న సినిమాలు గురించి రిలీజ్ కి ముందు మాట్లాడడం తనకు కాస్త టెన్షన్ అనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. అయితే పుష్ప 2 మాత్రం ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. మై డియర్ ఫాన్స్, నా ఆర్మీ ఐ లవ్ యు. నా ఫాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలామంది ఫాన్స్ అవుతారు కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరో అయ్యాను. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లు అవుతున్నా మీరు చూపించే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా ఎక్కువగా తెరమీద కనిపిస్తానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప స్టైల్ లో థియేటర్లలో అడుగుపెట్టేలా చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు.

Show comments