RAAKA : పుష్ప ప్యాట్రన్ ఫాలో అవుతున్న ‘రాకా’.. రిలీజ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రాకా’ విడుదలకు సంబంధించి సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 డిసెంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.సన్ పిక్చర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ రోజే ‘మేక్ వే ఫర్ ద కింగ్’ అంటూ సోషల్ మీడియాను షేక్ చేసింది.
‘పుష్ప’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం కావడం అలాగే షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అట్లీ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పునర్జన్మలు, డిఫ్రెంట్ వరల్డ్ కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కలగలిపి అట్లీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ స్కేల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిని మించి తెరకెక్కిస్తున్నారు. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం..ఇండియన్ సినిమా పరిశ్రమలో ఈ దశాబ్దంలోనే అత్యంత భారీ ఈవెంట్ చిత్రంగా ‘రాకా’ నిలవనుంది. ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
తాజావార్తలు
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!