అల్లు అర్జున్ ముద్దుల కూతురు , గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మనవరాలు అర్హ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నప్పటి నుంచే తన అందంతో, ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌తో, క్యూట్ ముచ్చట్లతో సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక 2023లో ‘శాకుంతలం’ సినిమాతో తెరంగెటరం చేసి. మొదటి చిత్రం తోనే స్పెషల్ అపియరెన్స్‌ల్లో మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. ఎందుకంటే అల్లు అర్జున్ తన కూతుర్ని మళ్లీ స్క్రీన్ మీద చూడాలనుకోలేదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది..!
Also Read : HHVM : కీరవాణి మ్యూజిక్‌కి ఫ్యాన్స్ ఫిదా..
సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న బజ్ ప్రకారం, అల్లు అర్హ తన సెకండ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈసారి ఆమె నటించబోయే చిత్రం ఎవరిదో తెలుసా? అల్లు అర్జున్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే భారీ పాన్-ఇండియా సినిమాలోనే. అట్లీ రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఓ ఎమోషనల్ చైల్డ్ రోల్ కోసం ఆయన ప్రత్యేకంగా అల్లు అర్హను కోరాడట. మొదట అల్లు అర్జున్ ‘నో’ చెప్పగా.. క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుండడంతో.. “ఇది అర్హకు ఒక గుర్తుగా ఉంటుంది” అనుకుంటూ ఓకే చెప్పేశాడట. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలిదు కానీ. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.
