NTV Telugu Site icon

Allu Aravind: అల్లు అర్జున్ రాలేకపోయారు.. అందుకే నేను వచ్చా!

హైదరాబాద్‌ లోని కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్ళారు అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై వాకబు అల్లు అరవింద్‌ చేశారు. శ్రీతేజ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడిన అరవింద్.. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్‌ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని అన్నారు. ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించింది అని వెల్లడించిన ఆయన కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్‌ రాలేక పోయారని అన్నారు.

Allu Aravind: బ్రేకింగ్: శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

అర్జున్‌ తరపున నేను ఆస్పత్రికి వచ్చాను అని అల్లు అరవింద్‌ పేర్కొన్నారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఏర్పడి రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ ఆ ధియేటర్ కి వెళ్లడంతో తొక్కిసలాట ఏర్పడింది. రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి శ్రీ తేజ్ కి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.