NTV Telugu Site icon

Allu Aravind: బ్రేకింగ్: శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

Allu Aravind

Allu Aravind

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఏర్పడి రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ ఆ ధియేటర్ కి వెళ్లడంతో తొక్కిసలాట ఏర్పడింది. రేవతి అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రోజు నుంచి శ్రీ తేజ్ కి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ ప్రకటించి పాతిక లక్షలు సాయం చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాక చికిత్సకు అవసరమైన ఒక ఇంజక్షన్ కూడా సింగపూర్ నుంచి తెప్పించినట్లుగా తెలుస్తోంది. తాజాగా కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెళ్లారు.

Tollywood Rewind 2024 : 2024లో భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచిన తెలుగు సినిమాలివే

శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత శ్రీ తేజ్ కుటుంబ సభ్యులతో సైతం ఆయన మాట్లాడినట్టుగా చెబుతున్నారు. ఇక తొక్కిసలాట కారణంగా శ్రీ తేజ్ తల్లి రేవతి మరణించింది. ఆ రోజు నుంచి శ్రీ తేజ్ ఆరోగ్య ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు. నిన్న హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలంగాణ హెల్త్ సెక్రటరీ క్రిస్టినాతో కలిసి శ్రీ తేజను పరమర్శించారు. శ్రీ తేజ్ ఇంకా స్పృహలోకి రాలేదని, అప్పటి నుంచి వెంటిలేటర్ మీదనే ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ మేరకు నిన్న కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఒక హెల్త్ బులిటెన్ సైతం రిలీజ్ చేశారు.