NTV Telugu Site icon

Allu Aravind : సాయి పల్లవి నా సొంత కూతురు లాంటిది..

Allu

Allu

ఫిధా సినిమాతోటాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి పల్లవి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. తన నటన, డాన్స్ తో సాయి పల్లవి అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయిది. గ్లామర్ షో కు దూరం గా ఉండే సాయి పల్లవి కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో నాగ చైతన్య సరసన తండేల్ అనే సినిమాలో నటిస్తుంది సాయి పల్లవి.మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read : Pawan Kalyan: ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలైంది!

తాజాగా తండేల్ సినిమా రిలీజ్ డేట్ ప్రెస్ మెట్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. రిలీజ్ పై రోజులకొక డేట్ వినిపిస్తున్న నేపథ్యంలో . తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ చేస్తునట్టు అధికారకంగా ప్రకటించారు. కాగా ఈ కార్యక్రమమంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అల్లు అరవింద్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ” ఇటీవల సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా చూసాను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు నా కళ్ళలో నీళ్లుతిరిగాయి. సినిమా చివరలో ఆఖరున వచ్చే సీన్ లో సాయి పల్లవి నటన ప్రతి ఒక్కరిని కదిలించింది. ఆ ఎమోషన్ లోనే సాయి పల్లవితో మాట్లాడాలని బయటకు రాగానే ఆమెకు కాల్ చేసి మాట్లాడాను. నేను సాయి పల్లవిని ఎప్పుడూ సొంత కూతురులా చూస్తాను. నాకే గనక కూతురు ఉంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది’ అని అన్నారు.  అమరన్   సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవిని అల్లు అరవింద్ పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందించారు.

Show comments