NTV Telugu Site icon

Allu Aravind: ‘మెగా ట్రోలింగ్’.. అల్లు అరవింద్ నో కామెంట్స్

Allu Aravind

Allu Aravind

నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తుండగా గీత ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో సినిమా హీరో హీరోయిన్ల కంటే ఎక్కువగా అల్లు అరవింద్ కనిపిస్తున్నారని కామెంట్స్ ముందు నుంచి వినిపిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ఆయన గేమ్ చేంజర్ సినిమాను ఉద్దేశిస్తూ దిల్ రాజుతో ప్రస్తావించిన మాటలు మెగా అభిమానులకు టార్గెట్ అయ్యాయి. దానికి తోడు ఈ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతూ ఉండగా అక్కడ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ హీరోగా నటించిన మొదటి సినిమా చిరుత గురించి ఆయన కామెంట్ చేశారు.

Kolkata: సెలవు విషయంలో ఘర్షణ.. నలుగురికి కత్తిపోట్లు

ఆ సినిమా యావరేజ్ గా ఆడిందని తాను మగధీర లాంటి హిట్ ఇప్పించానని అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. దీంతో ఆయన మీద మెగా అభిమానులు ఒకరకంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని తండేల్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్టు ప్రస్తావించగా ఈ విషయం మీద అల్లు అర్జున్ స్పందించనని అన్నారు. ఈ ట్రోలింగ్ తన దృష్టికి వచ్చిందని, గమనిస్తున్నానని పేర్కొన్న ఆయన దీని మీద కామెంట్ చేసేందుకు నిరాకరించారు. నో కామెంట్స్ అంటూ ఆయన తెలివిగా ఆ ప్రశ్నను దాటవేయడం గమనార్హం.