Site icon NTV Telugu

Allu Aravind: చరణ్ నా కొడుకు లాంటోడు.. ఇక్కడితో ఆపేయండి!

Allu Aravind

Allu Aravind

రామ్ చరణ్ మీద తాను చులకన చేయున్నట్టుగా కామెంట్స్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం మీద అల్లు అరవింద్ స్పందించారు. తండేల్ సినిమా పైరసీ జరుగుతుంది దాన్ని అరికట్టాలంటూ ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ఈ మేరకు అల్లు అరవింద్ కామెంట్ చేశారు.. గతంలో తండేల్ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఉన్న సమయంలో రామ్ చరణ్ సినిమాను ఆయనను తక్కువ చేసి మాట్లాడినట్లు ఒక సీనియర్ జర్నలిస్టు ప్రస్తావించారు. అయితే అప్పుడు స్పందించడం కరెక్ట్ కాదని నేను భావించి నో కామెంట్స్ అని కామెంట్ చేశాను. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ పేర్కొన్న ఆయన చరణ్ తనకు కొడుకు లాంటివాడని చెప్పుకొచ్చారు. నాకు ఉన్న ఏకైక మేనల్లుడు రామ్ చరణ్, ఆయనకు ఉన్న ఏకైక మేనమామను నేను.

Laila: పృథ్వి రాజ్ కామెంట్స్ కలకలం.. షైన్ స్క్రీన్స్ కీలక ప్రకటన

నిజానికి ఆరోజు దిల్ రాజు కష్టాలను ప్రస్తావిస్తూ నేను మాట్లాడాను, అది యాదృచ్ఛికంగా వచ్చిన విషయమే తప్ప నేను కావాలని ప్రస్తావించింది కాదు అంటూ అల్లు అరవింద్ కామెంట్ చేశారు. ఈ విషయంలో ఫీలైన మెగా అభిమానులకు నేను చెప్పేది ఒక్కటే, నేను ఉద్దేశపూర్వకంగా దిల్ రాజుతో మాట్లాడుతున్నప్పుడు అలా అనలేదు. చరణ్ కి నాకు ఉన్న రిలేషన్షిప్ ఒక ఎక్స్లెంట్ రిలేషన్షిప్, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయండి. దయచేసి అర్థం చేసుకోండి దిల్ రాజు లైఫ్ గురించి ప్రస్తావించడానికి మాత్రమే ఆ పదాన్ని వాడాను అలా వాడడం కరెక్ట్ కాదేమో అని తర్వాత అనిపించింది అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు

Exit mobile version