నాగచైతన్య హీరోగా అన్న సాయి పల్లవి హీరోయిన్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా రూపొందుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే ఈ సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 రూపాయల మేర టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశాన్ని కల్పించింది. సినిమా నిర్మాణ సంస్థ ప్రతిపాదనల మేరకు ఈ మేరకు జీవో జారీ చేసింది. అయితే తెలంగాణలో ఎందుకు టికెట్ రేట్లు పెంచమని అడగలేదు అంటూ అల్లు అరవింద్ కి తాజాగా జరిగిన ప్రెస్మీట్లో ప్రశ్న ఎదురయింది.
Allu Aravind: ‘మెగా ట్రోలింగ్’.. అల్లు అరవింద్ నో కామెంట్స్
ఈ క్రమంలో తండేల్ సినిమా టికెట్ పెంపు గురించి అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరల పెంపు కోసం అడిగాం అని తెలంగాణలో టికెట్ ధరల పెంపు కోసం అడగలేదు అన్నారు. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయన్న ఆయన టికెట్ ధరలు రూ.50 పెంచమనే ఏపీ ప్రభుత్వాన్ని అడిగామన్నారు. తెలంగాణలో రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయన్న ఆయన తండేల్ సినిమాకి బెనిఫిట్ షోలు లేవు, అంత బెనిఫిట్ మాకు వద్దు అంటూ సరదాగా కామెంట్ చేశారు.