కామెడీ స్టార్ అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ చిత్రాలకు బ్రాండ్ గా నిలిచేవారు.అయితే గత కొంతకాలంగా నాంది ,ఉగ్రం వంటి సీరియస్ సబ్జెక్ట్స్‌తో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ఈ సారి మళ్ళి రూటు మార్చి మరోసారి కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .తాజాగా మరోసారి కామెడీ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉందని అల్లరి నరేష్ తెలిపారు.ఆయన నటించిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకురానుంది.రాజీవ్ చిలకా నిర్మిస్తున్న ఈ చిత్రంతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం అల్లరి నరేష్ ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు .
ఈ సినిమాకి నాన్నగారి సినిమా టైటిల్ పెట్టడంతో ఆ చిత్రంతో పోలుస్తారెమో అని భయపడ్డాను.కథకు తగ్గట్లు సరిపోతుందని ఆ టైటిల్ పెట్టడం జరిగిందని నరేష్ తెలిపారు.ఈ సినిమాలో హీరోకి వయసు ముదురుతున్న పెళ్లి కాదు, అందరూ పెళ్లెప్పుడు..అని అడుగుతుంటారు. ఆ చిరాకులో చెప్పే డైలాగే ‘ఆ ఒక్కటీ అడక్కు’..పెళ్లి గురించి నడిచే ఈ కథతో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చినట్లు నరేష్ తెలిపారు.మా దర్శకుడు మల్లి నిజ జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.ఈ సినిమా క్లైమాక్స్ ఎంతో ఎమోషనల్ గా సాగుతుందని నరేష్ తెలిపారు.అయితే గత కొన్నేళ్లుగా సీరియస్ చిత్రాలు చేస్తున్న ఇప్పుడు మళ్ళీ కామెడీ సినిమా చేస్తుండటంతో నా సొంత గ్రౌండ్ లో ఆడుతున్న ఫీలింగ్ కలుగుతుందని అల్లరి నరేష్ తెలిపారు .