NTV Telugu Site icon

“సన్ ఆఫ్ ఇండియా” టీజర్ రిలీజ్ చేయనున్న సూర్య

All set for the Son of India Teaser Launch by Suriya

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న చిత్రం టీజర్ను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు “సన్ ఆఫ్ ఇండియా” టీజర్ ను తమిళ స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా నిర్మాతలు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే గత ఏడాది వచ్చిన “ఆకాశం నీ హద్దురా” ఈ చిత్రంలో మోహన్ బాబు, సూర్య కలిసి నటించిన విషయం విదితమే.