అల్లు అర్జున్ పుష్ప 2 కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుష్ప కలెక్షన్ల గురించే అందరి ఫోకస్ నెలకొంది. ఎందుకంటే పుష్ప మొదటి భాగం రిలీజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉండేది. అప్పట్లో టికెట్ రేట్ల విషయంలో కంట్రోల్ ఉండేది కాబట్టి ఏపీలో పుష్పకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని ప్రచారం ఉంది. ఇక తాజాగా ఇదే విషయాన్ని ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు మీడియా ప్రతినిధులలో ఒకరు. అయితే ఆసక్తికరంగా మైత్రి నిర్మాతలు ఈ విషయం మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పుష్ప మొదటి భాగం రిలీజ్ అయినప్పుడే మంచి కలెక్షన్స్ రాబట్టిందని ఇప్పుడు టికెట్ రేట్లు బడ్జెట్ పెట్టి పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మంచి కలెక్షన్స్ రాబడుతుందని చెప్పుకొచ్చారు.
Love Reddy: షాకింగ్: లవ్ రెడ్డి నటుడిపై ప్రేక్షకురాలి దాడి
ఇక నిజానికి పుష్పా 2 ఆంధ్ర ప్రదేశ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. మొత్తానికి 85 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక్క సీడెడ్ మాత్రమే 30 కోట్లకి అమ్మారు. అలా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రీజియన్ వరకు 115 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ మార్క్ సాధించినట్లు అవుతుంది. అయితే కేవలం ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఇప్పటివరకు 100 కోట్ల షేర్ సాధించిన సినిమాలు రెండు మాత్రమే ఉన్నాయి. అంటే విభజన తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు మాత్రమే కేవలం ఏపీ ప్రాంతం వరకు 100 కోట్ల మార్కు సాధించిన ఘనత ఉంది. కాబట్టి ఈసారి ఏపీలో పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుందనే విషయం మీద అందరి ఫోకస్ ఉందనే చెప్పే చెప్పాలి.