గ్రాండ్ పా కోసం ఆలియా భట్ గ్రాండ్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె తల్లి సోనీ రాజ్దాన్, సోదరి షాహీన్ భట్ తో పాటూ నీతూ కపూర్ కూడా పార్టీకి హాజరయ్యారు! అయితే, పార్టీలో నీతూ కపూర్, రిషీ కపూర్ కూతురు రిధిమా కపూర్ కూడా కనిపించింది. కానీ, అందరి దృష్టీ మాత్రం సహజంగానే రణబీర్ పై పడింది. ఆలియా తాతయ్యతో కలసి బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేస్తుండగా… ఓ ఫోటోలో రణబీర్ కూడా కెమెరాకి చిక్కాడు!
బాలీవుడ్ స్టార్ కపుల్ స్టోరీ ఇప్పుడు దాదాపుగా అఫీషియల్ అవ్వటంతో ఆలియా, రణబీర్ ఒకరింటికి ఒకరు తరుచూ వచ్చి వెళుతున్నారు. ఆ క్రమంలోనే కాబోయే శ్రీమతిగారి తాతకి… ఆర్కే కూడా బర్త్ డే విషెస్ చెప్పటానికి ఆలియా ఇంటికి చేరుకున్నాడు. ఆమె తాతగారికి 93 ఏళ్లు! అయితే, ఆయన ఆలియా తండ్రికి తండ్రి కాదు. ఆలియా భట్ తల్లి సోనీ రాజ్దాన్ తండ్రి.
ఆలియా, రణబీర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ విడుదల కావాల్సి ఉంది. అయితే, కరోనా లాక్ డౌన్స్ వల్ల హై బడ్జెట్ మల్టీ స్టారర్ డిలే అవుతూ వస్తోంది. ఆలియా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…
గ్రాండ్ పా కోసం ఆలియా గ్రాండ్ బర్త్ డే పార్టీ! ఫోటోలో గ్రాండ్ సన్ రణబీర్!
