‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అలియా భట్, తాజాగా జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించింది. ఆమె నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ ఏకంగా ఐదు నేషనల్ అవార్డులు సొంతం చేసుకుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు కరోనా కారణంగా వాయిదా పడినప్పటికీ, థియేటర్లలోకి వచ్చాక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read : Coolie : ఒక్క ‘కూలీ’ చూస్తే వంద భాషల సినిమాలు చూసినట్టే – నాగార్జున
2022లో విడుదలైన ఈ చిత్రంలో అలియా భట్‌తో పాటు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఇక ‘గంగూబాయి కతియావాడి’ సినిమాకు ఇప్పటి వరకు ఒకటి రెండు కాదు ఏకంగా 50 అవార్డులు లభించాయని ఐఎండీబీ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తమ నటి కేటగిరీలో అలియా భట్‌కి జాతీయ అవార్డు రావడం గర్వకారణం. అంతేకాకుండా ఈ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగ్ రైటింగ్), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ వంటి విభాగాల్లో నేషనల్ అవార్డులు లభించాయి. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఓటీటీపై కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది.
