Site icon NTV Telugu

ప్రొడ్యూసర్ గా ‘ట్రిపుల్ ఆర్’ బ్యూటీ! షారుక్ తో చెట్టపట్టాల్!!

Alia Bhatt

Alia Bhatt

ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘బ్రహ్మాస్త్ర’, ‘గంగూభాయ్ ఖతియావాడి’ చిత్రాల్లో నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారుతోందనే వార్త గతంలోనే వచ్చింది. అయితే… ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం అలియా ప్రిపరేషన్ మొదలు పెట్టేసింది. ‘డార్లింగ్స్’ పేరుతో నిర్మితం కాబోతున్న ఈ సినిమాకు షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ సైతం భాగస్వామిగా ఉండబోతోంది. తొలియత్నంలో చేదు అనుభవాలు ఏమీ ఎదురు కాకుండా ఉండటం కోసం అలియా సీనియర్ ప్రొడక్షన్ హౌస్ తో చేతులు కలిపింది.

Read Also : సోషల్ మీడియాలో పెరిగిపోతోన్న ‘బాలీవుడ్ యోగా’ క్రేజ్…

ముంబైకి చెందిన దిగువ మధ్యతరగతిలోని తల్లీ కూతుళ్ళ కథగా ‘డార్లింగ్స్’ రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే రచయిత్రిగా చక్కని గుర్తింపు పొందిన జస్మిత్ కె రీన్ ఈ మూవీని తొలిసారి డైరెక్ట్ చేస్తోంది. ఇందులో ‘సత్య’ ఫేమ్ షఫాలీ షా తో పాటు విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ కీలక పాత్రలు పోషించబోతున్నారు. గతంలోనూ షారుక్ ఖాన్ తో కలిసి నటి జుహీ చావ్లా కొన్ని సినిమాలు నిర్మించింది. ఆ రకంగా చూసినప్పుడు షారుక్ లో నమ్మకస్తుడైన స్నేహితుడే వీళ్లకు కనిపించాడు. ఇదిలా ఉంటే… ఇవాళ వరల్డ్ యోగా డే సందర్భంగా అలియా భట్ యోగాసనాలు వేస్తున్న వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఒంటిని వింటిలా మార్చి అమ్మడు వేసిన యోగాసనాలు చూసి, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దాంతో ఈ వీడియో విశేషంగా వైరల్ అయిపోతోంది.

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

Exit mobile version