పేరుకు స్టార్ కిడ్ అయినా ఆలియా భట్… ఆ ట్యాగ్ ఇండస్ట్రీలోకి రావడానికి గ్రీన్ కార్పెట్ అయ్యిందేమో కానీ, వచ్చాక మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకుంది. తొలినుంచి తనకు, మిగిలిన హీరోయిన్లకు డిఫరెన్స్ ఉండాలన్న థోరణితో ఉన్న ఆలియా, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలపై కాన్సంట్రేషన్ చేసి, తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హైవే, ఉడ్తా పంజాబ్ నుండి జిగ్రా వరకు “సంథింగ్ న్యూ” అనే రోల్స్ ఎంచుకుని సక్సెస్ అయిన త్రిపుల్ ఆర్ బ్యూటీ.
కెరీర్ ఫస్ట్ నుంచే సెలెక్టివ్ సబ్జెక్టులను టచ్ చేసిన ఆలియా, ఇప్పుడు బోల్డ్ డెసిషన్ తీసుకుంటోంది. ఫస్ట్ టైమ్ అడల్ట్ మూవీని చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఈ డేరింగ్ స్టెప్ తీసుకోబోతుందన్న బజ్ బాలీవుడ్‌లో సర్క్యులేట్ అవుతోంది. చాక్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి, తన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మిస్తోంది ఆలియా. సిల్వర్ స్క్రీన్ కోసం కాకుండా, ఓటీటీ కోసం ఆమె ఈ బోల్డ్ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. యే జవానీ హై దీవానీ, బ్రహ్మాస్త్రం చిత్రాలకు సహాయ దర్శకురాలిగా వర్క్ చేసిన శ్రీతి ముఖర్జీ ఈ సినిమాకు దర్శకురాలిగా మారబోతున్నట్లు టాక్. వేకప్ సిడ్ తరహాలో లేడీ యాంగిల్‌లో మూవీ ఉండబోతుందని సమాచారం.
నాలుగు సాంగ్స్, గ్లామర్ షోకు ఫస్ట్ నుంచే పరిమితం కాలేదు ఆలియా. ఉడ్తా పంజాబ్లో డ్రగ్స్ బాధితురాలిగా, రాజీలో భారత గూఢచారిగా, గంగూభాయి కతియావాడీలో వేశ్యగా, డార్లింగ్స్లో డొమెస్టిక్ వైలెన్స్‌కు బలైన మహిళగా మెప్పించడంలో సక్సెస్ అయింది బ్యూటీ. జిగ్రా మెప్పించకపోయినా, ఆమె నటనకు వంక పెట్టాల్సిన పనిలేదు. ఇక నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా ఇలాంటివే ఎంచుకోబోతుంది. యశ్ రాజ్ స్పై యూనివర్స్ ఆల్‌ఫాలో మేడమ్ రియల్ స్టంట్స్ చేయబోతుంది. అలాగే లవ్ అండ్ వార్లో కూడా ఆమెకు డిఫరెంట్ రోల్ డిజైన్ చేస్తాడని సమాచారం సంజయ్ లీలా భన్సాలీ నుండి వస్తోంది.
ఇప్పుడు ఈ అడల్ట్ మూవీలో యాక్ట్ చేయడం బీటౌన్‌ను షాక్‌కు గురి చేసినా, ఇలాంటి సాహసపేతమైన క్యారెక్టర్లు చేయడం ఆలియాకు అలవాటే కాబట్టి, ఆమె నిర్ణయం సరైనదే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
