బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి విషయమై నెట్టింట్లో చాలా రోజుల నుంచి పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోవాలని రణబీర్, అలియా భావించారు. కాని ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా పెళ్ళికి సంబంధించిన ప్రణాళికలను మార్చుకున్నారట ఈ ప్రేమపక్షులు. కోవిడ్ కారణంగా దేశం మొత్తం కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్న కారణంగా వివాహం చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదని భావించిన రణబీర్, అలియా వారి వివాహ ప్రణాళికలను వాయిదా వేసుకున్నారట. వచ్చే ఏడాది చివర్లో రణబీర్, అలియా పెళ్లి చేసుకోబోతున్నారట. ప్రస్తుతం వారి చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించారట రణబీర్, అలియా. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన పౌరాణిక ఫాంటసీ డ్రామా ‘బ్రహ్మాస్త్ర’లో ఈ యువ జంట హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
రణబీర్, అలియా పెళ్లి వాయిదా ?
