Site icon NTV Telugu

Puri Jagannadh: పూరి… ఏంటి ఇంత పని చేశావ్? కెరీర్లోనే ఇది దారుణం!!

Puri Jagannadh Speech

Puri Jagannadh Speech

Ali Track in Double iSmart Movie Went Wrong : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి డైలాగ్స్ తూటాల్లా పేలతాయి. అసలు పూరి హీరో అంటేనే థియేటర్ దడదడలాడిపోద్ది. అయితే.. ఒక్క హీరో క్యారెక్టర్ మాత్రమే కాదు, పూరి సినిమాల్లో మరో స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అదే అలీ కామెడీ ట్రాక్. పూరి తన సినిమాల్లో అలీ కోసమే సపరేట్‌గా ఒక కామేడీ ట్రాక్ రాసుకుంటాడు. ఇడియట్, దేశ ముదురు, పోకిరి, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సూపర్, చిరుత వంటి సినిమాల్లో అలీ చేసిన క్యారెక్టర్స్ అంతా ఈజీగా మరిచిపోలేం. ఇప్పటికీ ఆలీ చేసిన కామెడీ సోషల్ మీడియాను రూల్ చేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం డబుల్ ఇస్మార్ట్‌లో అలీ ట్రాక్ బెడిసికొట్టింది. ఇది పూరి కెరీర్లోనే వరస్ట్ ట్రాక్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Mr Bachchan: దారుణమైన ట్రోల్స్.. టీం సంచలన నిర్ణయం

ఇందులో అలీ బోకా అనే క్యారెక్టర్‌లో కనిపించాడు. అప్పుడెప్పుడో పదిహేనేళ్ల క్రితం ఇలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకున్నామని.. పూరి, అలీ పలు ఇంటర్య్వూస్‌లో చెప్పుకొచ్చారు. అలీ గెటప్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉండడంతో.. ఇదేదో గట్టిగా పేలేలా ఉందని అనుకున్నారు. కానీ డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఏదైనా బిగ్గెస్ట్ మైనస్ ఉందా? అంటే, అది అలీ కామెడీ ట్రాక్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు పూరి రాసుకున్న అలీ కామేడీ ట్రాక్‌లలో ఇదే దారుణమైందని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఈ బోకా క్యారెక్టర్ సినిమాలో చిరాకు తెప్పించేలా ఉందని అంటున్నారు. అంతేకాదు.. ఈ ట్రాక్‌ని సినిమాలో నుంచి లేపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్‌గా పూరి కూడా ఆలీ పాత్రకు సంబంధించిన సీన్స్‌ ట్రిమ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఏదేమైనా.. బోకా ట్రాక్ మాత్రం పూరి కెరీర్లోనే డిజాస్టర్‌గా నిలిచిందని చెప్పాలి.

Exit mobile version