Site icon NTV Telugu

Ali: రాజేంద్ర ప్రసాద్ బూతు వ్యాఖ్యలపై స్పందించిన అలీ

Ali Rajendraprasad

Ali Rajendraprasad

తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా, కామెడీ కింగ్‌గా పేరొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఈ వివాదంపై కమెడియన్ అలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, రాజేంద్ర ప్రసాద్‌ను సమర్థిస్తూ మీడియాను ఉద్దేశించి కీలక సందేశం ఇచ్చారు.

Also Read:KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావొద్దని కేసీఆర్ నిర్ణయం..

ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ అలీని ఉద్దేశించి అనుచిత పదజాలంతో మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో, అలీ ఈ విషయంపై స్పందిస్తూ, “నిన్న కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారికి మాట తూలింది. సరదాగా అన్నారు, దీన్ని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్, ఆయన దుఃఖంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు అమ్మ లాంటి కూతురు చనిపోయింది. అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. కావాలని ఈ విషయంలో రచ్చ చేయకండి, ఆయన పెద్దాయన,” అని అన్నారు.

Also Read:Mrunal Thakur: ఇంత పిసినారి హీరోయిన్‌ని ఎక్కడ చూసి ఉండరు..

అలీ ఈ స్పందనలో రాజేంద్ర ప్రసాద్‌ను సమర్థిస్తూ, ఆయన వ్యాఖ్యలు సరదాగా చేసినవేనని, దాన్ని అతిగా పెద్దది చేయొద్దని మీడియాను కోరారు. అలాగే, రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తన కుమార్తె గాయత్రి మరణంతో (అక్టోబర్ 5, 2024) భావోద్వేగ స్థితిలో ఉన్నారని, ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు.

Exit mobile version