Site icon NTV Telugu

ALCC: ఘనంగా ‘ఏఎల్సిసి’ సినిమా బిగ్ టికెట్ లాంచ్

Alcc

Alcc

యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్) సినిమా ట్రెయిలర్ ఈమధ్యనే విడుదలై ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ లేలీధర్ రావు కోలా మాట్లాడుతూ.. ” ఈ సినిమాని ఎంతో ఇష్టంగా తీశాను. కచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళకు నచ్చుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా కోసం నా టీం చాలా కష్టపడింది. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన నగేష్ కి, సముద్రకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.” అని అన్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 25 వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version