Site icon NTV Telugu

బ్రిటీష్ కాలపు భారత న్యాయవాదిగా అక్షయ్ కుమార్!

కామెడి నుంచీ యాక్షన్ దాకా, రొమాన్స్ నుంచీ ఫ్యాంటసీ దాకా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేస్తుంటాడు అక్షయ్ కుమార్. ఆయనంత స్పీడ్ గా మూవీస్ సైన్ చేసే మరో స్టార్ హీరో ఎవరూ బాలీవుడ్ లో లేరు. ఆయన ఖాతాలో మరో ఇంట్రస్టింగ్ బయోపిక్ పడబోతోందా? అవుననే అంటున్నారు బీ-టౌన్ ఇన్ సైడర్స్! ప్రస్తుతం ‘ఖిలాడీ’ స్టార్ తో ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ చర్చలు జరుపుతున్నాడట. ఆల్రెడీ రెండు, మూడు మీటింగ్స్ కూడా జరిగినట్టు సమాచారం. ఇక పేపర్ వర్క్ పూర్తి చేసి అధికారికంగా ప్రకటించటమే తరువాయి అంటున్నారు…

ఇంతకీ, కరణ్ జోహర్ నిర్మాణంలో అక్షయ్ చేయబోయే ఆసక్తికర బయోపిక్ ఏంటి? బ్రిటీష్ పాలన కాలంలో జలియన్ వాలా భాగ్ మారణకాండ జరిగింది. దాని వెనుక దాగి ఉన్న కుట్రల్ని బయటకు తీసేందుకు ఆనాటి మన లాయర్ సి. శంకరన్ నాయర్ ప్రాణాలకు తెగించి కోర్టులో పోరాటం చేశారు. ఆయన వాదనల వల్ల బ్రిటీష్ పాలకులు, అధికారుల రాక్షసత్వం బయటపడింది. ఆనాటి భారతీయల్లో స్వాతంత్ర్య కాంక్ష పెల్లుబికింది. అటువంటి లెజెండ్రీ ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ లోనే మన అక్షయ్ కుమార్ కనిపించబోతున్నాడు. అయితే, కరణ్ త్యాగి దర్శకత్వం వహించే కరణ్ జోహర్ మూవీలో అక్కీ కనిపిస్తాడా అన్నదానిపై కొంత అనుమానం మాత్రం ఉంది. ఆయన డైరీ ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. వరుసగా చాలా సినిమాలే చేస్తున్నాడు కుమార్. కనీసం అరడజను చిత్రాలు ఆయన హీరోగా వివిధ దశల్లో ఉన్నాయి. వాటన్నిటి మధ్యా సి. శంకరన్ నాయర్ బయోపిక్ కూడా అక్షయ్ మ్యానేజ్ చేయగలడా? ఆయన గురించి తెలిసిన వారైతే తప్పకుండా ఏదో విధంగా సినిమాకు సై అంటాడనే అంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ…

Exit mobile version