Akshay Kumar has put his payment on hold until crew is paid Says Jackky Bhagnani: బడే మియాన్ చోటే మియాన్ సినిమా చేసి రకుల్ ప్రీత్ సింగ్ భర్త, మామ అనూహ్యంగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించారు. అయితే ఏప్రిల్ 10వ తేదీన బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. కేవలం 60 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సినిమా వెనక్కి రాబట్టింది. దీంతో దాదాపుగా 240 కోట్ల రూపాయలకు పైగా జాకీ భగ్నాని, వశుభగ్నాని నష్టపోయినట్లయింది.
The RajaSaab: ప్రభాస్ రాజాసాబ్ కథ లీక్.. నిర్మాత కాపీ ఆరోపణలు!
ఈ దెబ్బతోటి ఏకంగా ఆఫీస్ అమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళకి ఇంకా కొంతమందికి పేమెంట్లు పెండింగ్ ఉన్నాయనే విషయం తెరమీదకు వచ్చిన తర్వాత జాకీ భగ్నాని ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. అదేంటంటే ఈ విషయం తెలిసిన వెంటనే అక్షయ్ కుమార్ తమకు అండగా నిలబడ్డాడని, అక్షయ్ కుమార్ కి ఇవ్వాల్సిన పేమెంట్ ఆపేయమని కోరాడని చెప్పుకొచ్చారు. అందరి పేమెంట్స్ క్లియర్ అయిన తర్వాత ఇబ్బందులు క్లియర్ అయిన తర్వాతే తనకు పేమెంట్ ఇవ్వాలని ఆయన తమకు అభయం ఇచ్చాడని ఈ సందర్భంగా జాకీ భగ్నాని వెల్లడించాడు.
ఒకరకంగా పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన జాకీ భగ్నానికి ఇది చాలా ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. ఈ రకంగా రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు స్టార్ హీరో అక్షయ్ కుమార్ అండగా నిలిచాడు అన్నమాట. అయితే ఇంకా సినిమాకి పనిచేసిన కొంతమంది టెక్నీషియన్ లతో పాటు నటీనటులకి కూడా పూర్తిస్థాయి పేమెంట్లు జరగలేదని తెలుస్తోంది. భారీగా నష్టపోయిన నేపథ్యంలో దాన్ని ఎలా అయినా క్లియర్ చేస్తామని కాస్త సమయం కావాలని జాకీ భాగ్నని వశుభగ్నాని కోరినట్లుగా తెలుస్తోంది. మొత్తంమీద రకుల్ ప్రీత్ సింగ్ వివాహం తరువాత భర్త కుటుంబం చేసిన సినిమాలు నష్టపోవడం సంచలనం కలిగించే విషయం అనే చెప్పాలి.