Site icon NTV Telugu

Akkineni : ఖైరతబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో అక్కినేని నాగార్జున

Nag

Nag

టాలీవుడ్ స్టార్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున ఈ రోజు ఉదయం ఖైరతబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేసారు. ఇటీవల అక్కినేని నాగార్జున హై ఎండ్ కారును కొనుగులు చేసారు.ఆ కొత్త కార్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చిన హీరో నాగార్జున. తన కొత్త లెక్సస్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ లో అధికారుల సమక్షంలో ఫోటో దిగి వెహికల్ రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరో ఇలా బయటకు రావడంతో నాగార్జునతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

Also Read : Pawan Kalyan : చివరి దశలో ‘హరి హర వీర మల్లు పార్ట్-1 షూటింగ్

ఇక మరోవైపు నాగార్జున ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ మంగళవారం నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అలాగే వచ్చేనెల 4న పెద్ద కుమారుడు అక్కినేని నాగ చైతన్య తో శోభిత ధూళిపాళ్ల వివాహం జరగనుంది. మరోవైపే తన సినీ కెరీర్ లో కూడా నాగార్జున సరికొత్త పంధాలో వెళుతున్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమాలో చేస్తున్నాడు. అటు సినిమాలు, ఇటు ఫ్యామిలీ శుభకార్యాలతో నాగార్జున జోష్ లో ఉన్నారు.

Exit mobile version