Site icon NTV Telugu

Akkineni : మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు..?

Legal Akkinieni Rgv

Legal Akkinieni Rgv

అక్కినేని కుటుంబంపై వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాలు, ఇటు టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపాయి. టాలీవుడ్ నటీనటులు ఒక్కతాటిపైకి వచ్చి ఈ విషయన్ని తీవ్రంగా ఖండించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉంటూ ఇలాంటి చవకబారు మాట్లాడితే ఊరుకునేది లేదని తీవ్ర స్థాయిలో మంత్రిపై ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని అంత సులువుగా నాగార్జున వదిలిపెట్టారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మంత్రి కొండా సురేఖకు అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున వైజాగ్‌లో ఉన్నారు, బీజేపీ నేత మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆరోగ్యం బాగోలేకపోవడంతో పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లారు నాగార్జున. హైదరాబాద్ వచ్చాక చట్టపరంగా నాగార్జున నోటీసులు పంపనున్నట్టు సమాచారం. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని చట్టపరంగా పోరాడతరని తెలిసింది. ఈ వ్యవహారంపై అక్కినేని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందారు.

Also Read : Nani : దసరా నాడు ‘దసరా దర్శకుడి’తో నేచురల్ స్టార్ సినిమా లాంఛ్

ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై కొండా సురేఖ క్షమాపణలు చెప్పడాన్ని రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టాడు. RGV మాట్లడుతూ ” కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి..? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు. ఇది సమంతను అవమానించడం ఎలా అయింది? వాళ్లిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ లోవుండే అందరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగ చైతన్య చాలా సీరియస్‌గా తీసుకుని మరచిపోలేని గుణపాఠం నేర్పాలి.

Exit mobile version