Site icon NTV Telugu

Akhil : అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ ఆ..?

Akhil Wedding

Akhil Wedding

అక్కినేని అఖిల్ అతి త్వరలో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త జూల్ఫీ రవ్ డ్జీ కూతురు జైనబ్ తో అఖిల్ ప్రేమాయణం నడపగా.. వాళ్ల ఎంగేజ్మెంట్ గత ఏడాది నవంబర్ 26న జరిగింది. ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా నాగచైతన్య రెండో పెళ్లి సమయంలోనే అఖిల్‌ నిశ్చితార్థం చేసుకోవడం అందరూ షాకయ్యారు. అప్పటి నుంచి ఈ జంట ఎక్కువగా ఎయిర్ పోర్ట్‌లో కనిపించింది. ఇక ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయని.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుందని సోషల్‌ మీడియా లో వార్తలు వైరల్ అవుతుండగా.అక్కినేని కుటుంబం నుంచి మాత్రం పెళ్లి పై ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ ఇంటి సభ్యులు ఎవరు స్పందించడం లేదు.. తాజాగా వీళ్ల వివాహ తేదీ ఖరారు అయినట్లు తెలుస్తోంది.

రానున్న రెండు వారాల్లోనే అంటే జూన్ మొదటి వారం 6న జరగనుందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక పెళ్లి డేట్ ప్రఛారంలోకి రావడంతో.. మరి వీరి వెడ్డింగ్ హైదరాబాద్‌లో జరుగుతుందని కొందరు.. లేదు రాజస్థాన్‌లోని ఓ ప్రఖ్యాత ప్యాలెస్‌లో జరుగుతుందని మరికొందరు నెట్టింట చర్చలు జరుపుతున్నారు.

ఇక ఇండస్ట్రీలో బ్రోకెన్ ఫ్యామిలీ అంటే అక్కినేని. ఎందుకంటే సుమంత్ విడాకులు తీసుకున్నారు,నాగార్జున విడాకులు తీసుకుని అమల ని రెండో పెళ్లి చేసుకున్నారు, ఇక చైతన్య సామ్‌ని ఎంతగానో ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ బంధం కూడా మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.. ఇక అఖిల్ కూడా ముందుగా ఓ అమ్మాయితో ఏంగేజ్‌మెంట్ చేసుకుని ఇప్పుడు ఇంకో అమ్మయిని పెళ్లి చేసుకుంటున్నాడు. అంటే ఫ్యామిలీ మొత్తం వివాహ బంధంలో దెబ్బ తినడం జరిగింది. అయినప్పటికీ నాగ్ అమల హ్యాపి లైఫ్ లీడ్ చేస్తున్నారు. చై శోభిత కూడా హ్యాపీగా ఉన్నారు.. మరి అఖిల్ కూడా తన బంధం ఎంత వరకు నిలబెట్టుకుంటారు చూడాలి..

Exit mobile version