Akhil: అయ్యగారు ఎక్కడా తగ్గట్లేదు.. ఈసారి లెక్కేసి కొట్టడమే!
- యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అక్కినేని అఖిల్ సినిమా
- అనిల్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా అక్కినేని అఖిల్ కెరియర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా
- రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhil Akkineni UV Creations Project will be Released in 2 Parts: అక్కినేని నాగార్జున- అమల దంపతుల కుమారుడు అక్కినేని అఖిల్ చిన్నప్పుడే సిసింద్రీ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే దురదృష్టమో లేక స్క్రిప్టు సెలక్షన్లో లోపమో తెలియదు కానీ హీరోగా మారిన తర్వాత సరైన హిట్టు ఒకటి కూడా పడలేదు. అఖిల్ మొదలు హలో, మజ్ను వంటి సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా నిలవగా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పరవాలేదు అనిపించుకుంది. ఆ సినిమా ఆడింది కదా అనుకుంటే ఆ తర్వాత ఏజెంట్ సినిమా అత్యంత దారుణమైన డిజాస్టర్ గా నిలవడమే కాదు అఖిల్ కెరియర్ లో మళ్ళీ ఇంకో సినిమా ఎప్పుడు మొదలు పెడతాడా అనేనేంతలా గ్యాప్ ఇచ్చేసింది.
Jackky Bhagnani: పీకల్లోతు అప్పుల్లో రకుల్ ప్రీత్ భర్త… అండగా నిలబడ్డ స్టార్ హీరో!
Also Read
- Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
- Mega158: బర్త్‌డే స్పెషల్‌గా 'మెగా158' బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
- Tejeswini Nandamuri : హీరోయిన్గా బాలయ్య చిన్న కూతురు
- Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
ఇక ఇప్పుడు అఖిల్ సినిమాల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మనోడు ఇప్పటికే ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఆ సినిమా కోసం ఇప్పటికే బాడీ బిల్డింగ్ చేసే పనిలో కూడా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కిన పలు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అక్కినేని అఖిల్ కెరియర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని అంటున్నారు.
అంతేకాదు ఒక భాగంగా కాదు రెండు భాగాలుగా సినిమాని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. మొదటి భాగం కచ్చితంగా సూపర్ హిట్ అయితేనే రెండో భాగం మీద ఇప్పటి ప్రేక్షకులకు ఆసక్తి ఏర్పడుతోంది. కాబట్టి రెండు భాగాలను ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించాలని సినిమా యూనిట్ సిద్దమైనట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి ఎప్పుడు అధికారికంగా సినిమాలు ప్రకటించి ఎప్పుడు పట్టాలెక్కిస్తారు అనేది.
తాజావార్తలు
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది’
-
Varun Tej: జై జై బాబు.. కళ్యాణ్ బాబు అంటూ మార్మోగిన ఈవెంట్.. పవన్ కళ్యాణ్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
Mega158: బర్త్‌డే స్పెషల్‌గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు
-
Alluri Sitarama Raju International Airport: ‘ఎర్రబస్సులు కాదు.. ఇప్పుడు ఎయిర్‌బస్‌లు తిరుగుతున్నాయి’
-
Parliament protests: హుందాతనం నుంచి హంగామా వైపు.. పార్లమెంట్లో నిరసనల తీరు ఎలా మారింది?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!