Lenin: ‘లెనిన్’ టీజర్‌లో అఖిల్ వాయిస్ మార్పుకు అసలు కారణం ఇదే.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్!

Akhil Akkineni, Lenin Movie,

Akhil Akkineni, Lenin Movie,

‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’. అఖిల్ కెరీర్‌లోనే ఇప్పటివరకు చేయని సరికొత్త మాస్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అవుట్‌పుట్ పట్ల చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. అయితే అక్కినేని అభిమానులకు ‘లెనిన్’ (Lenin) అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఇందులో భాగంగా రీసెంట్‌గా ఈ చిత్రం జూన్ 26న విడుదల కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. అలాగే టీజర్ కూడా వదిలారు. దీంతో ఇప్పుడు సినిమా నేపథ్యం మరియు అఖిల్ క్యారెక్టరైజేషన్‌కు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

కాగా ఈ టీజర్‌లో అఖిల్ ఒరిజినల్ వాయిస్ కాకుండా వేరే బేస్ వాయిస్ వినిపించడంతో అభిమానుల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. టీజర్‌లో వాయిస్ వేరుగా ఉన్నప్పటికీ.. మెయిన్ సినిమాలో అఖిల్ తన సొంత వాయిస్‌తోనే పక్కా రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారట. ఇందుకోసం అఖిల్ ప్రత్యేకంగా లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.