Site icon NTV Telugu

Akhil Akkineni: లెనిన్ టైటిల్ గ్లింప్స్ రివ్యూ

Lenin Review

Lenin Review

అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం లెనిన్ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అఖిల్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8, 2025) సందర్భంగా అభిమానులకు ఒక ట్రీట్ గా మారింది. గతంలో ‘ఏజెంట్’ సినిమాతో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన అఖిల్, సుదీర్ఘ గ్యాప్ తీసుకుని ఈసారి లెనిన్తో కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తున్నాడు. లెనిన్ సినిమా టైటిల్ గ్లింప్స్ ను అఖిల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు.

ఈ గ్లింప్స్ లో.. మా నాయన నాకో మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా.. పేరు ఉండదు.. అట్నే పోయేటప్పుడు ఊపిరి ఉండదు.. పేరు మాత్రమే ఉంటది.. అనే మాస్ డైలాగ్ అఖిల్ వాయిస్ తో చెప్పించారు. చివర్లో ఏ యుద్ధం ప్రేమ యుద్ధం కంటే ఎక్కువ కాదు అనే స్లోగన్ ఇచ్చారు. దీంతో ఇది పర్ఫెక్ట్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాను ‘వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారని టాక్. ఈ సినిమా చిత్తూరు నేపథ్యంలో రూరల్ యాక్షన్ లవ్ స్టోరీగా రూపొందనుందని సమాచారం.

Sudigali Sudhir : హిందూ దేవుళ్లను అవమానించిన సుడిగాలి సుధీర్..?

అఖిల్ కొత్త లుక్
ఇప్పటివరకు రొమాంటిక్ మరియు సాఫ్ట్ క్యారెక్టర్స్‌లో కనిపించిన అఖిల్, లెనిన్తో తన ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక రగ్గడ్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అఖిల్ గత చిత్రాల్లో ఎక్కువగా సాఫ్ట్, లవబుల్ క్యారెక్టర్స్‌లో కనిపించాడు. ‘ఏజెంట్’ సినిమాతో యాక్షన్ హీరోగా మారాలని ప్రయత్నించినా, ఆ సినిమా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో లెనిన్తో అతను తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరకంగా లెనిన్ అనౌన్స్‌మెంట్ అఖిల్ అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. “అఖిల్ ఈసారి తప్పకుండా బ్లాక్‌బస్టర్ కొడతాడు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అయితే కొంతమంది అఖిల్ కి లుక్ సెట్ కాలేదని అంటున్నారు. గ్లిమ్ప్స్ అయితే పర్ఫెక్ట్ ఫ్యాన్ స్టఫ్ అని చెప్పొచ్చు. అఖిల్ ఈ కొత్త జోన్‌లో ఎలా ఆకట్టుకుంటాడు, ఈ సినిమా అతనికి ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది చూడాల్సి ఉంది.

Exit mobile version