అక్కినేని అఖిల్ 5వ చిత్రం “ఏజెంట్” అనే యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్యాంటులో తుపాకీ పెట్టుకుని సూపర్ హాట్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ కోసం మన యంగ్ హీరో చాలానే కష్టపడ్డాడు. ఆయన పడిన శ్రమ పోస్టర్ లో స్పష్టంగా కన్పిస్తోంది. సురేందర్ రెడ్డి ముందుగా చెప్పినట్టుగానే అఖిల్ ఫస్ట్ లుక్ చాలా డిఫెరెంట్ గా ఉంది.
Read Also : తెరపైకి దాసరి బయోపిక్ !
ఇక ఈ పోస్టర్ తో పాటు మూవీ షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. హైదరాబాద్ లో ఈ గూఢచారి థ్రిల్లర్ మూవీ షూటింగ్ జరుపుకోనుంది. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. “ఏజెంట్”కు వక్కంతం వంశీ కథ రాయగా, తమన్ సంగీతం అందించారు. మరోవైపు అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. మరి ఆయన అనుకున్నట్టుగా ఈ చిత్రంతోనైనా తొలి సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.