అఖండ 2 రిలీజ్ కు మూడు తేదీలను ఫైనల్ చేశారు మేకర్స్. ఒకసారి ఆ డేట్స్ ను పరిశీలించి చూస్తే..
డిసెంబర్ 25: డిసెంబర్ 25న రిలీజ్ డేట్ అనుకుంటే 24 రాత్రి ప్రీమియర్లతో సినిమా విడుదలైతే, 4 రోజుల లాంగ్ వీకెండ్ ప్లస్ ప్రీమియర్లతో కలిపి హాలిడే విడుదల దొరుకుతుంది. కాబట్టి రిలీజ్ డే అడ్వాంటేజ్ వలన డే 1 గ్రాస్ కాస్త గట్టి నంబర్ ఉంటుంది. ఇక జనవరి 1వ తేదీ రెండవ వారంలో వస్తుంది కాబట్టి అది కూడా భారీ అడ్వాంటేజ్ అవుతుంది. అప్పుడు సెకండ్ వీకెండ్ కూడా మంచి వసూళ్లు రాబట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే, రెండవ వారాంతం తర్వాత ప్రీ-ఫెస్టివల్ ఎఫెక్ట్ కారణంగా సినిమా దాదాపుగా బాక్సాఫీస్ రన్ ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సంక్రాంతికి భారీ సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మరోపక్క సినిమాను 25రిలీజ్ చేస్తే అప్పటివరకు ఇప్పుడున్న బజ్ ఉంటుందా అనే అనుమానం ఉంది. ఎందుకంటే ఇంకా 2 వారాల కంటే ఎక్కువ గ్యాప్ ఉంది. ప్రమోషన్ల మళ్ళీ చేయాలి.
డిసెంబర్ 12: డిసెంబర్ 12న 11వ రాత్రి ప్రీమియర్లతో, ఎక్కువ ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎలాగు భారీ హైప్ ఉంది. సో టీమ్ జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టిన సరిపోతుంది. కానీ మొదటివీకెండ్ మరియు సెకండ్ వీకెండ్ లో సెలవులు లేవు. కానీ మరొక అడ్వాంటేజ్ ఏంటంటే సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది. 3వ మరియు 4వ వారంలో హాలిడే అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్. భారీగా థియేట్రికల్ రైట్స్ సేల్ అయ్యాయి కాబట్టి లాంగ్ రన్ ఉంటే రికవరీ కాస్త ఏక్కువ ఉంటుంది. సో డిసెంబర్ 12 బెస్ట్ ఛాయిస్.
Also Read : MEGA Release : బాబాయ్ – అబ్బాయ్ సినిమాలు రిలీజ్ డేట్స్ మారబోతున్నాయా?
ఇది డిసెంబర్ 19 : ఈ రోజు విడుదల అయితే సెకండ్ వీకెండ్ స్టార్టింగ్ లో అలాగే మూడవ వారం ప్రారంభంలో సెలవులు రావడంతో బిగ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. అలాగే డిసెంబర్ 12 మరియు డిసెంబర్ 25 డేట్స్ లో ఇప్పటికే అనేక చిన్న సినిమాలు రిలీజ్ రెడీ అయ్యాయి. వాటికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ మూడు తేదీలలో ఏ డేట్ లో రిలీజ్ అయితే బాగుంటుందనే విషయంలో మేకర్స్ తర్జన భర్జన పడుతున్నారు.
