NTV Telugu Site icon

Akhanda 2: సెప్టెంబర్ లో అఖండ 2!

Akhanda 2 Thaandavam

Akhanda 2 Thaandavam

నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకున్న గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసింది. నిజానికి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలతో హిట్లు కొడుతూ వస్తోంది. ఇక ఈ భామ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతోన్న విషయాన్ని సినిమా యూనిట్ జనవరిలోనే అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి తన సూపర్ హిట్ చిత్రం అఖండ సీక్వెల్ చేస్తున్నారు. అఖండ 2 తాండవం పేరుతో ఈ సినిమాని డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్నారు.

Group-3 Results: అలర్ట్.. గ్రూప్ 3 ఫలితాలు విడుదల

ఇక ఈ మధ్యనే మహాకుంభమేళాలో కొన్ని సీన్స్ షూట్ చేసుకు రాగా తరువాత అన్నపూర్ణ స్టూడియోలో ఒక షెడ్యూల్ షూట్ చేశారు. ఇక సెప్టెంబర్ లో అఖండ 2 చిత్రం విడుదలవుతుందని హిరోయిన్ సంయుక్త మీనన్ చెప్పుకొచ్చింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సంయుక్త మీనన్….ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీరదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం మూడు సినిమాలో నటిస్తున్నాని…బాలకృష్ణతో నటించడం మంచి అనుభూతి కలిగిస్తుందన్నారు సంయుక్త మీనన్.