నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా సీక్వెల్ అయిన ‘అఖండ 2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సినిమా విడుదలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ‘అఖండ 2’ సినిమా థియేట్రికల్, డిజిటల్ విడుదలలన్నింటినీ నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ S.M. సుబ్రమన్యం మరియు జస్టిస్ C. కుమారప్పన్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆంక్షలను విధించింది. ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ పక్షాన కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఎరోస్ సంస్థ ప్రధానంగా 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పిపై తీవ్ర ఆరోపణలు చేసింది.
Also Read : Akhanda 2 : షాకింగ్.. అఖండ ప్రీమియర్స్ క్యాన్సిల్
సినిమా నిర్మాతలు తమకు చెల్లించాల్సిన ₹28 కోట్లు చెల్లించకుండానే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎరోస్ ఆరోపించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కు అనుబంధ సంస్థ అయిన 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పి సినిమా విడుదల ప్లాన్ చేసిందని ఎరోస్ వాదించింది. ఎరోస్ ఇంటర్నేషనల్ తరపున సీనియర్ కౌన్సిల్‌లు P.S. రమణ్ మరియు A.R.L. సుందరేశన్ లు సమర్థవంతంగా తమ వాదనలు వినిపించారు. డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం, కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ‘అఖండ 2’ సినిమాను ఏ రూపంలోనూ విడుదల చేయడం అసాధ్యం అని అంటున్నారు.
