నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. అఖండ తో చిత్ర పరిశ్రమలు ఊపునిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : Kishkindhapuri : కిష్కింధపురి.. ప్రీమియర్.. బెల్లంకొండకు ఓ మంచి హిట్
కాగా ఈ సినిమా ఓటీటీ డీల్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. అఖండ 2 ను నెట్ప్ ఫ్లిక్స్ రూ. 80 కోట్లకు కొనుగోలు చేసినట్టు బిజినెస్ సర్కిల్స్ లో వినిపించే టాక్. బాలయ్య క్రేజ్ తో పాటు కాంబినేషన్ క్రేజ్ కూడా తోడవడంతో భారీ ధర పెట్టిందట. అయితే పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల మార్కెట్ కలిగిన నలుగురు తెలుగు హీరోలకు మాత్రమే ఆ ధర ఉంది. ఇప్పుడు ఆ స్థాయి రేట్ బాలయ్య సినిమాకు రావడం రికార్డ్ అనే చెప్పాలి. ఏదేమైనా నిర్మాతలకు ఓటీటీ రూపంలో జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి. కాగా అఖండ 2 ను ఈ ఏడాది డిసెంబరు 5 న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
