అఖండ 2 ప్రీమియర్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న బాలకృష్ణ అభిమానులకు సినిమా టీమ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అఖండ 2 తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ ఖరారు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్‌తో సినిమా ప్రారంభించాలని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసినట్లుగా సినిమా టీమ్ ప్రకటించింది.
Also Read : Eesha: హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు ఈ సినిమా చూడొద్దు !
“ఈరోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. మేము సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్” అంటూ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ పెట్టింది. నిజానికి, అమెరికా సహా ఇండియాలో కూడా ప్రీమియర్స్ పెద్ద ఎత్తున ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. కానీ, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇప్పుడు ఆ ప్రీమియర్స్ ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. సినిమా రేపు ఉదయం యధావిధిగా రిలీజ్ అవుతుందని పేర్కొంది.
