Site icon NTV Telugu

Akhanda2 : అఖండ 2కు లాజిక్కులు అక్కర్లేదు, ఓన్లీ దైవత్వం : దిల్ రాజు

Akhanda 2

Akhanda 2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. 11నరాత్రి ప్రీమియర్స్ మొదలైనప్పుడు నుంచి మాకు ఒక క్యూరియాసిటీ. నేను సుదర్శన్ కి వెళ్లాను. శిరీష్ ని కూకట్ పల్లి భ్రమరాంభ థియేటర్ పంపించాను. మిగతా వారిని వేరే థియేటర్స్ కి పంపించాను. అన్ని చోట్ల రియాక్షన్స్ అదిరిపోయింది. బోయపాటి – బాలకృష్ణని ఇండియన్ సూపర్ హీరో చేశారు. దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం బోయపాటి – బాలకృష్ణ కంబోకు చెందింది. ఒక గొప్ప మ్యాజిక్ జరిగింది. ఆడియన్స్ ప్రతి ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఎపిసోడ్లో బాలకృష్ణని బోయపాటి అద్భుతంగా చూపించారు. ఫ్రైడే సెకండ్ షోస్ నుంచి ఎక్కడ చూసినా థియేటర్స్ ఉదృతంగా మారాయి. మహిళలు పిల్లలు ఈ సినిమాని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజే 70 పెర్సెంట్ రికవర్ చేశాం. ఈమధ్య బాలకృష్ణ దాదాపు సినిమాలన్నీ మేమే రిలీజ్ చేస్తున్నాం. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఒక నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా చాలా ఆనందంగా ఉంది. బాలకృష్ణ – బోయపాటి టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాకి లాజిక్కులు అక్కర్లేదు. ఓన్లీ దైవత్వం. నెక్స్ట్ జనరేషన్ కి ఈ సినిమా ఒక గీత. ప్రతి ఒక్కరిని దైవత్వంతో కనెక్ట్ చేసినందుకు బాలకృష్ణ – బోయపాటికి థాంక్యూ వెరీ హ్యాపీ’ అని అన్నారు.

Exit mobile version