Pattudala: అజిత్ ‘పట్టుదల’ ట్రైలర్ అదిరింది.. చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ఈ సినిమాను తెలుగులో ‘పట్టుదల’గా విడుదల చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ రాగా ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లే క్రమంలో మేకర్స్ ‘పట్టుదల’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
Tabu: యంగ్ హీరోయిన్లను తలదన్నేలా సీనియర్ హీరోయిన్.. ఎక్కడా తగ్గట్లేదుగా!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ఇక తాజాగా ట్రైలర్‌ను గమనిస్తే..అజిత్ స్టైలిష్‌గా సాల్ట్ అండ్ పేపర్ లుక్‌తో నెవర్ బిఫోర్ స్టైలిష్ రూపంలో మెప్పించబోతున్నారని అర్ధమవుతోంది. ట్రైలర్‌లో తన వాళ్ల కోసం అజిత్ విలన్స్‌తో చేస్తున్న పోరాటాలు, అజిత్, త్రిష మధ్య కుదిరిన క్యూట్ కెమిస్ట్రీతో పాటు అజర్ బైజాన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు అబ్బురపరుస్తున్నాయి. మరో వైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఓ వైపు జైలులో ఖైదీగా, మరోవైపు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రెజీనా కసాండ్ర సైతం ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో అలరిస్తుందని ట్రైలర్‌లో ఆమెను చూస్తుంటేనే అర్తమవుతుంది. ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించనున్నారని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. ఇక ఓంప్రకాష్ విజువల్స్ సినిమా లుక్‌ను పూర్తిగా మార్చేయటమే కాదు, బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడబోతున్న ప్రేక్షకులకు పట్టుదల సినిమా ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందనిపించేలా ఉంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన తనదైన శైలిలో మరో సూపర్బ్ ట్యూన్‌తో, బీజీఎంతో ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు పట్టుదల సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్‌తో పీక్స్‌కి చేరుకున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా, ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయగా, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేశారు.
- Tags
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!