NTV Telugu Site icon

అజయ్ దేవగన్ “భగత్ సింగ్”కు 19 ఏళ్ళు

Ajay Devgn celebrates 19 years of The Legend of Bhagat Singh

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ నటించిన “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్‌”కు నేటితో 19 ఏళ్లు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #19YearsOfTheLegendOfBhagatSingh అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ నేడు ఈ చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పిక్ ను పోస్ట్ చేశారు. 2002లో విడుదలైన ఈ చిత్రం నుండి తన త్రోబాక్ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్” చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు ఈ హీరో. ఇక అజయ్ దేవ్‌గన్‌తో పాటు సుశాంత్ సింగ్, డి సంతోష్, అఖిలేంద్ర మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రాజ్ బబ్బర్, ఫరీదా జలాల్, అమృత రావు సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రం భగత్ సింగ్ జీవితం చుట్టూ తిరుగుతుంది. జలియన్ వాలా బాగ్ లో జరిగిన ఊచకోత భారత స్వాతంత్య్ర పోరాటంలో చేరడానికి అతన్ని ఎలా ప్రేరేపించింది? అనే ఆసక్తికర అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ చిత్రంలో భగత్ సింగ్ జీవితాన్ని చిన్ననాటి నుండి మార్చి 23, 1931 వరకు అంటే ఆయనను ఉరి ఉరితీసే వరకు జరిగిన ఘటనలను చూపించారు. కాగా ప్రస్తుతం అజయ్ దేవగన్ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్, మైదాన్, గంగూబాయి కతియావాడి, థాంక్స్ గాడ్, మేడే సినిమాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా అక్షయ్ కుమార్ “సూర్యవంశీ” చిత్రంలో కూడా అతిధి పాత్రలో కనిపించనున్నారు.