Site icon NTV Telugu

అల్లు అర్జున్ సోదరిగా ఐశ్వర్య రాజేష్!?

Aishwarya Rajesh to play sister role in Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమా పై అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ తో అటు ఫ్యాన్స్ ఇటు ఆడియన్స్ పుల్ గా ఫిదా అయిపోయారు. మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండటం, ప్రత్యేక పాత్రలో ఊశ్వరిరౌటేలా చేస్తుండటం సినిమాని మరింత హైప్ కి తీసుకు వెళ్ళాయి. ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఇందులో ఓ అద్భుతమైన ఐటమ్ కంపోజ్ చేశాడట. దానినే ఊర్వశిపై చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, బన్నీ సోదరి పాత్రలో కనిపించబోతుందట. ఐశ్వర్య సెంటిమెంట్ ట్రాక్ సినిమాలో కీలకం అంటున్నారు. ఆమె చావుకి బన్నీ రివేంజ్ తీర్చుకోవడమనే అంశం హైలైట్ అవుతుందట. రష్మిక గిరిజన యువతిగా కనిపించనున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Exit mobile version