సీనియర్ నటుడు రాజేష్ కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఓన్ పాథ్ ఏర్పాటు చేసుకుంది ఐశ్వర్య రాజేష్. గ్రిప్పింగ్ కాన్సెప్టులను ఎంచుకుని వర్సటైల్ యాక్ట్రెస్‌గా ఛేంజయ్యింది. సినిమాలో తన పాత్రకు వెయిటేజ్ ఉంటేనే సినిమాను ఒప్పుకుంటుంది. లేడీ ఓరియెంట్, ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ.. తమిళ సినిమాలతోనే పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామకు.. టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరచలేదు. అయితే ఐశ్వర్య టాలెంట్ గుర్తించిన టీటౌన్ కౌసల్య కృష్ణమూర్తితో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ సినిమాతో ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈ సుందరి.. మిస్ మ్యాచ్.. వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ చిత్రాలు ప్లాప్ మూటగట్టుకోవడంతో కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ వెయిటేజ్ పెరిగే చిత్రాలను చేసింది. ఫర్హానా, భూమిక, డ్రైవర్ జమున అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్.
Brahmanandam: శేఖర్ కమ్ముల సినిమా రిజెక్ట్ చేసిన బ్రహ్మానందం కొడుకు !
ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకుని సంక్రాంతికి వస్తున్నాం రీ ఎంట్రీతో అదరగొట్టింది ఈ అచ్చ తెలుగమ్మాయి. గట్టి కం బ్యాక్ ఇచ్చింది. బౌన్స్ బ్యాక్ హిట్ అందుకుంది. వయస్సుకు మించిన పాత్రలకు ప్రాణం పోయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా భర్తను అమితంగా ప్రేమించే భార్యగా వెంకటేష్ నే డామినేట్ చేసిందనే చెప్పవచ్చు. నిజానికి ఈ పాత్రకోసం కొంతమంది హీరోయిన్స్ ను సంప్రదించినా నలుగురు పిల్లల తల్లి పాత్ర అనగానే వెనకడుగు వేశారు. కానీ భాగ్యం పాత్రను అర్ధం చేసుకుని రంగంలోకి దిగిన ఐశ్వర్య అదరగొట్టింది. ప్రజెంట్ తమిళంతో పాటు ఉత్తరాఖండతో శాండల్ వుడ్ ఎంట్రీ ఇస్తుంది అమ్మడు. మరీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆఫర్లు కొల్లగొట్టిన అంజలిలా, ఐశ్వర్య కూడా బిజీగా మారుతుందా..? ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంతో పాటు.. కమర్షియల్ హీరోయిన్ గా ఛేంజ్ అవుతుందా..? అనేది వేచి చూడాలి.