NTV Telugu Site icon

Aishwarya Rai : పెళ్లికి ముందే మగబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్ .. షాకింగ్ విషయం వెలుగులోకి?

Aish Rumours

Aish Rumours

మిస్ వరల్డ్ గా అందరినీ ఆకట్టుకున్న ఐశ్వర్యారాయ్ తన అందచందాలతో అభిమానులను కట్టిపడేసింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లోకి అడుగుపెట్టి “ఇరువర్` సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై అరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన ఐశ్వర్యారాయ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటిగా మారింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ హిందీలో ఎక్కువ సినిమాల్లో నటించింది. అక్కడ వరుస హిట్లు కొల్లగొట్టి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగింది. అక్కడే అమితాబ్ బచ్చన్ కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడింది. అంతకు ముందు చాలా మంది నటీనటులతో ఆమె డేటింగ్ చేసిందని ప్రచారం జరిగింది.

Narne Nithiin: హిట్టు కొట్టి సైలెంటుగా ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఎన్టీఆర్ బామ్మర్ది

అయితే చివరికి అభిషేక్ బచ్చన్ ఆమెను 2007లో వివాహం చేసుకున్నాడు. వారికి ఆరాధ్య (2011) అనే కుమార్తె ఉంది. ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ వేడుకలో ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి కనిపించింది. ఆరాధ్యని చూసి అందరూ షాక్ అయ్యారు. ఆరాధ్య త్వరలోనే కథానాయికగా తెరంగేట్రం చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంబానీ పెళ్లిలో కూడా వీరు దూరంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు విడివిడిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి విడాకుల వార్త సంచలనం సృష్టించింది. అయితే దీనిపై ఐశ్వర్య కానీ, అభిషేక్ కానీ స్పందించలేదు. ఇది కూడా ఈ పుకార్లకు బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ సంచలన వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. పెళ్లికి ముందే ఐశ్వర్యకు కొడుకు ఉన్నాడనే వార్త సంచలనంగా మారుతోంది.

ఐశ్వర్యరాయ్ కొడుకుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. సంగీత్ కుమార్ తాను ఐశ్వర్యరాయ్ కొడుకునని చెబుతున్న వీడియో ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. ఇది నాలుగేళ్ల క్రితం కాగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను లండన్‌లోని “`IVF-ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌’’ ద్వారా జన్మించానని సంగీత్ తెలియజేశాడు. తన తల్లి ఐశ్వర్యరాయ్ అని, లండన్ లో పుట్టిన తనను తల్లిదండ్రులు విశాఖపట్నం తీసుకొచ్చారని చెబుతున్నాడు. తనను ఐశ్వర్య తల్లిదండ్రులు పెంచారని, తన పుట్టుకకు సంబంధించిన అన్ని ఆధారాలను ధ్వంసం చేశారని, ఇప్పుడు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పడం తీవ్ర కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అతనెవరు? ఎందుకు అలా మాట్లాడుతున్నాడనే విషయంపై ఆరా తీస్తే అతడి మానసిక స్థితి సరిగా లేదని తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు విడాకుల వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో ఈ విషయం కూడా సోషల్ మీడియాలో కూడా వ్యాపించి మరోసారి సంచలనం సృష్టిస్తోంది.

Show comments