Site icon NTV Telugu

Aishwarya Rai: తల్లిగా ఆ విషయంలో ఆందోళన చెందుతున్న ఐశ్వర్యా రాయ్‌..

Aishwarya

Aishwarya

అందం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు ఐశ్వర్యారాయ్. తన అందంతో పాటు అద్భుతమైన వ్యక్తిత్వం‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బాలీవుడ్ నటి కేవలం హిందీలో మాత్రమే కాకుండా, భాషతో సంబంధం లేకుండా తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియా వినియోగం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐశ్. ముఖ్యంగా తల్లిగా ఈ విషయంలో తనకు ఆందోళన కలుగుతుంది ఆమె స్పష్టం చేశారు.

Also Read : Dhurandhar : మూవీ సెట్లో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రి పాలైన 120 మంది..

ఆమె మాట్లాడుతూ – “ప్రజలు ఇప్పుడు గుర్తింపు అంటే.. సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్ కోసం పరుగులు పెడుతున్నారు. కానీ అవి మన విలువను నిర్ణయించలేవు. నిజమైన అందం మనలోనే ఉంటుంది. సోషల్ మీడియా, సామాజిక ఒత్తిడికి పెద్ద తేడా లేదని నేను భావిస్తాను. తల్లిగా ఇది నన్ను ఆందోళనకు గురి చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీని బానిసలు అవుతున్నారు. మన ఆత్మగౌరవం కోసం సోషల్ మీడియాలో వెతకడం తప్పు.. అది అక్కడ దొరకదు. నిజమైన ప్రపంచాన్ని చూడాలంటే ఈ సోషల్ మీడియాను దాటి చూడాలి’’ అని తెలిపింది ఈ అతిలోక సుందరి. దీంతో ఆమె మాటలు విన్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుత యువతకు అవసరమైన మెసేజ్ ఇదే అని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక సినీ విషయానికొస్తే ఐశ్వర్య రాయ్ చివరిసారి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో కనిపించారు.

Exit mobile version