NTV Telugu Site icon

Home Town: #90స్ మేకర్స్ నుంచి మరో వెబ్ సిరీస్ ‘హోం టౌన్’

Hometown

Hometown

ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

Sankranthiki Vasthunnam: ఓటీటీలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త రికార్డ్

హోం టౌన్ వెబ్ సిరీస్ లో ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల తన పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. ఈ వెబ్ సిరీస్ ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఈ సిరీస్ కు సినిమాటోగ్రాఫర్ గా దేవ్ దీప్ గాంధీ కుండు పనిచేయగా..సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. హోం టౌన్ వెబ్ సిరీస్ కథా కథనాలను ప్రతి ప్రేక్షకుడు రిలేట్ చేసుకునేలా ఉంటాయి.