టాలీవుడ్‌లో రెగ్యులర్‌గా వచ్చే హర్రర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన మిస్టిక్ అండ్ సూపర్‌నేచురల్ అట్మాస్ఫియరిక్ థ్రిల్లర్ ‘అగధ’. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రవణ్ రెడ్డి తన క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నాడు. నిజానికి అగధను కేవలం ఒక సాధారణ హర్రర్ సినిమాగా పరిగణించలేం. దెయ్యాలు, రెగ్యులర్ జంప్ స్కేర్స్ కాకుండా.. పూర్తిగా మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాలతో ఈ కథను అల్లారు. భయపెట్టడం కంటే కూడా, వాతావరణం ద్వారా ప్రేక్షకుడికి నిరంతర ఉత్కంఠను కలిగించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. నటీనటుల పనితీరు ఈ థ్రిల్లర్ మూడ్‌ను క్యారీ చేశాయి.
ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి పోషించిన పాత్రలో హీరో, యాంటీ హీరో అనే రెండు విభిన్నమైన కోణాలు ఉంటాయి. మొదట్లో చాలా సాధారణంగా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించే పాత్ర.. కథ ముందుకు సాగే కొద్దీ ఊహించని మలుపులు తీసుకుంటుంది. పాజిటివ్ నుంచి నెగటివ్‌గా మారే ఆ గ్రే జోన్‌ను శ్రవణ్ చాలా డీసెంట్‌గా బ్యాలెన్స్ చేశాడు. ఎలాంటి అతి లేకుండా తన పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశాడు. హద్దులు మీరిన హావభావాలు, లౌడ్ యాక్టింగ్ కాకుండా.. చాలా సైలెంట్‌గా ఉంటూనే తన పాత్రలోని కాంప్లెక్సిటీని పండించిన విధానం ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తోంది. తెరపై అతను ఏమీ చేయకుండా ఉన్నప్పుడు కూడా, ఆ క్యారెక్టర్‌లో ఇంకేదో మిస్టరీ దాగుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. క్యారెక్టర్‌ను పూర్తిగా అర్థం చేసుకున్నామనే అవకాశాన్ని ఇవ్వకుండా, సినిమా ముగిసే వరకు ఒక సస్పెన్స్‌ను మైంటైన్ చేయడంలో శ్రవణ్ సక్సెస్ అయ్యాడు.

