Vijay Antony: బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది..
- విజయ్ ఆంటోనీ లేటెస్ట్ చిత్రం తుఫాన్
- ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రిలీజ్
- హైదరాబాద్ తో తెలుగు ఆడియెన్స్ తో నాకు మంచి అనుబంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి థ్యాంక్స్. సత్యరాజ్ గారు ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన మా మూవీలో భాగమవకుంటే ఇది అసంపూర్తి అయ్యేది. డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు మంచి స్క్రిప్ట్ ఈ మూవీకి రాశారు. నా రైట్ హ్యాండ్ లాంటి పర్సన్ డైలాగ్ రైటర్ భాష్యశ్రీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ సినిమా చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ గారు “తుఫాన్” సినిమా చేశారు. తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి గారు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మా మూవీని మరింత ఎఫెక్టివ్ గా మార్చారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ లో మ్యూజిక్ విని సర్ ప్రైజ్ అయ్యాను. త్వరలో ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్ తో, తెలుగు ఆడియెన్స్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. “తుఫాన్” సినిమాతో మీకు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా” అని అన్నారు.
Also Read
Also Read: Prashanth Varma: సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్న స్టార్ దర్శకుడు..ఎవరో తెలుసా..?
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!