Site icon NTV Telugu

Vijay Antony: బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది..

Untitled Design (54)

Untitled Design (54)

తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “తుఫాన్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి థ్యాంక్స్. సత్యరాజ్ గారు ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన మా మూవీలో భాగమవకుంటే ఇది అసంపూర్తి అయ్యేది. డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు మంచి స్క్రిప్ట్ ఈ మూవీకి రాశారు. నా రైట్ హ్యాండ్ లాంటి పర్సన్ డైలాగ్ రైటర్ భాష్యశ్రీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ సినిమా చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ గారు “తుఫాన్” సినిమా చేశారు.  తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తున్నారు.  మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి గారు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మా మూవీని మరింత ఎఫెక్టివ్ గా మార్చారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ లో మ్యూజిక్ విని సర్ ప్రైజ్ అయ్యాను. త్వరలో ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్ తో, తెలుగు ఆడియెన్స్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. “తుఫాన్” సినిమాతో మీకు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా” అని అన్నారు.

Also Read: Prashanth Varma: సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్న స్టార్ దర్శకుడు..ఎవరో తెలుసా..?

Exit mobile version