NTV Telugu Site icon

Subrahmanyaa: సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్ ఎవరంటే?

Subrahmanyaa

Subrahmanyaa

Subrahmanyaa: ప్రముఖ నటుడు సాయి కుమార్ ఫ్యామిలీ నుంచే ఇప్పటికే కొంతమంది నటులు ఉన్నారు. ఆది సాయి కుమార్ తరువాత ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ అవుతున్నాడు. సాయి కుమార్ తమ్ముడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేసేందుకు సెకెండ్ టైమ్ మెగాఫోన్ పట్టారు. “సుబ్రహ్మణ్య” టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ప్రతిష్టాత్మకంగా ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2గా నిర్మిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ప్రొడక్షన్ హౌస్ సుబ్రహ్మణ్య ప్రీ-లుక్‌ను రివిల్ చేసింది.

Also Read: Bandla Ganesh: ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రాణాలు పోయేవి!

పోస్టర్ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫాంటసీ వరల్డ్ లోకి స్నీక్ పీక్‌ను అందించారు. మూవీ ఆర్ట్‌వర్క్ గ్రాండియర్ గా కనిపిస్తోంది. ఈ స్పెల్‌ బైండింగ్ ప్రీ లుక్ సినిమాపై ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. ప్రీమియం లార్జ్ ఫార్మాట్, IMAX థియేటర్‌లలోని ప్రేక్షకులకు అడ్వంచర్ థ్రిల్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని బిగ్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ విజువల్, ఎమోషనల్ ట్రీట్‌గా అద్భుతమైన కథతో సెట్ చేశామని చెబుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా 60% నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది.

Also Read: Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబయిలోని ప్రముఖ రెడ్ చిల్లీస్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయని ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రముఖ స్టూడియోలలో VFX & CGI పనులు జరుగుతున్నాయని ప్రకటించారు. సుబ్రహ్మణ్య సినిమా టెక్నికల్‌గా ఉన్నతంగా ఉండబోతుంది, దీనికి టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారని చెబుతున్నారు. కెజిఎఫ్, సలర్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రాఫర్. విజయ్ ఎం కుమార్ ఎడిటర్. సప్త సాగరదాచే & చార్లీ 777 ఫేమ్ ఉల్లాస్ హైదూర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్. పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Show comments