Site icon NTV Telugu

వెనక్కి తగ్గిన ‘మేజర్’

Adivishesh's Major Movie Release date postponed

అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘మేజర్’. ముంబై టెర్రరిస్ట్ అటాక్ లో టెర్రరిస్టులను తుదముట్టించే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్ల‌స్ ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో వారు పునరాలోచనలో పడ్డారు. భారతదేశం గర్వించే ‘మేజర్’ చిత్రాన్ని పరిస్థితులు చక్కబడిన తర్వాత థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రాన్ని మలయాళంలోనూ విడుదల చేయబోతున్నారు. ఇందులో శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version