Karan Johar: ఆర్ధిక ఇబ్బందులు.. కరణ్ జోహార్ షాకింగ్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత- కరణ్ జోహార్ తన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో సగం వాటాను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్ విలువ రూ. 1000 కోట్లు. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది కూడా ఒకటని అంటున్నారు. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ వంటి హిట్ సినిమాలను అందించిన కరణ్ జోహార్.. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అదార్ పూనావాలాతో ఈ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అదార్ పూనావాలా సెరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ అలాగే ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 50 శాతం వాటాను రూ. 1,000 కోట్లకు కొనుగోలు చేస్తుంది.
Ayyanna Patrudu: నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావట్లేదు..
Also Read
ఈ డీల్‌లో సినిమా – టెలివిజన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ వాల్యుయేషన్ దాదాపు రూ.2000 కోట్లుగా అంచనా. ఇక ఒప్పందం పూర్తయిన తర్వాత, నిర్మాణ సంస్థలో మిగిలిన సగం వాటా ధర్మ ప్రొడక్షన్స్‌కు ఉంటుంది, కరణ్ జోహార్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటారు. ధర్మ ప్రొడక్షన్స్ ను 1976లో దివంగత యష్ జోహార్ స్థాపించారు, కరణ్ జోహార్ నాయకత్వంలో బాలీవుడ్‌లో పవర్‌హౌస్‌గా ఎదిగి ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. ఇందులో ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘యే జవానీ హై దీవానీ’, ‘కుచ్ కుచ్ హోతా హై’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ హౌస్ కింద 50కి పైగా సినిమాలు నిర్మించబడ్డాయి. 2018లో, కరణ్ జోహార్ కంపెనీ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో డిజిటల్ కంటెంట్‌లోకి ప్రవేశించింది. నెట్‌ఫ్లిక్స్ – అమెజాన్ ప్రైమ్ వంటి గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం షోలను నిర్మించింది.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!