NTV Telugu Site icon

Karan Johar: ఆర్ధిక ఇబ్బందులు.. కరణ్ జోహార్ షాకింగ్ నిర్ణయం

బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత- కరణ్ జోహార్ తన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో సగం వాటాను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్ విలువ రూ. 1000 కోట్లు. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది కూడా ఒకటని అంటున్నారు. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ వంటి హిట్ సినిమాలను అందించిన కరణ్ జోహార్.. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అదార్ పూనావాలాతో ఈ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అదార్ పూనావాలా సెరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ అలాగే ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 50 శాతం వాటాను రూ. 1,000 కోట్లకు కొనుగోలు చేస్తుంది.

Ayyanna Patrudu: నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావట్లేదు..

ఈ డీల్‌లో సినిమా – టెలివిజన్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ వాల్యుయేషన్ దాదాపు రూ.2000 కోట్లుగా అంచనా. ఇక ఒప్పందం పూర్తయిన తర్వాత, నిర్మాణ సంస్థలో మిగిలిన సగం వాటా ధర్మ ప్రొడక్షన్స్‌కు ఉంటుంది, కరణ్ జోహార్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉంటారు. ధర్మ ప్రొడక్షన్స్ ను 1976లో దివంగత యష్ జోహార్ స్థాపించారు, కరణ్ జోహార్ నాయకత్వంలో బాలీవుడ్‌లో పవర్‌హౌస్‌గా ఎదిగి ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. ఇందులో ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘యే జవానీ హై దీవానీ’, ‘కుచ్ కుచ్ హోతా హై’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి. ఈ ప్రొడక్షన్ హౌస్ కింద 50కి పైగా సినిమాలు నిర్మించబడ్డాయి. 2018లో, కరణ్ జోహార్ కంపెనీ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో డిజిటల్ కంటెంట్‌లోకి ప్రవేశించింది. నెట్‌ఫ్లిక్స్ – అమెజాన్ ప్రైమ్ వంటి గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం షోలను నిర్మించింది.