NTV Telugu Site icon

AD : ఆదిత్య హాసన్ తో చిన్నకొండ.. షూట్ ఎప్పుడంటే..?

Small

Small

ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, తొలి చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ పుష్పక విమానం’ పర్వాలేదనిపించాడు. ఆ వచ్చిన ‘బేబీ’ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. హిట్ తో పాటు పలు అవార్డులు సైతం తెచ్చి పెట్టింది బేబీ. అదే జోష్ కానీ ఆ వెంటనే వచ్చిన ‘గంగం గణేశా’ చిన్నకొండకు నిరాశమిగిల్చింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్యతో మరోసారి జోడిగా ‘డ్యూయెట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.

ఇవే కాకుండా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిన్న కొండ. తనతో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే క్లాసిక్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వినోద్ ఆనంతో మరో సినిమా అవకాశం ఇచ్చాడు ఆనంద్. ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమాను కూడా సైన్ చేసాడు ఈ హీరో. #90s వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ చెప్పిన కథకు ఆనంద్ పచ్చజెండా ఊపాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి లో మొదలెట్టనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమా ఆనంద్ దేవరకొండకు బేబీ కంటే బిగ్ హిట్ గా నిలుస్తుంది టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకుంటున్నాను ఆనంద్ దేవరకొండ.

Show comments